in

VARSHAM PART – 1

2003 లో ఒక్కడు లాంటి అల్ టైమ్ హిట్ తర్వాత ఏం ఎస్ రాజు ని ప్రభాస్ వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అబ్బాయి కోసం ఒక మంచి సినిమా ను తీయమని కోరారు స్టార్ హీరో అయ్యే మూవీ చేస్తానని మాటిచ్చారు ఎం ఎస్ రాజు.అప్పటికి ప్రభాస్ రెండు సినిమాలు చేశాడు అందులో ఒకటి ఫ్లాప్ ఇంకోటి ఏవరేజ్.రాజు గారు తన బ్యానర్ లో పని చేస్తున్న వీరుపోట్ల ని ఒక స్టోరీ అడిగాడు.వీరు పొట్ల రామాయణం ఇన్స్పిరేషన్ గా ఒక స్టోరీ లైన్ ను వినిపించాడు. రావణుడు లాంటి విలన్ సీత లాంటి హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తే హీరో ఎలా ఫైట్ చేసి తనను ఎలా దక్కించుకున్నాడు అనేది ఆ కాన్సెప్ట్ రాజు గారికి భలే నచ్చింది దీని చుట్టూ ఒక స్టోరీ రాయమన్నాడు బాబి సినిమాతో ఫ్లాప్ ను మూటకట్టుకున్న శోభన్ ని స్క్రిప్ట్ కి సహాయం గా పిలిచాడు.స్క్రిప్ట్ రైటర్ గా మంచి పేరున్న శోభన్ చాలా సీన్స్ చెప్పాడు.తన టాలెంట్ నచ్చి శోభన్ ను డైరెక్టర్ గా ఫిక్స్ చేశాడు ఎం ఎస్ రాజు.ఈ విధంగా స్క్రిప్ట్ మొత్తం పూర్తయింది.

only true spb fans can win this quiz!

George reddy