దర్శక ధీరుడు రాజమౌళి తాను కరోనా బారిన పడినట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మేము క్షేమంగానే ఉన్నాం. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడాలని చూస్తున్నాం.. ఆ తర్వాత ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నాం అని జక్కన్న తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజమౌళికి కరోనా అని తెలవగానే అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం కొంత భిన్నంగా స్పందించారు. సర్.. మీ సైనికుడు `బాహుబలి`ని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే దీని నుంచి కోలుకుంటార`ని వర్మ ట్వీట్ చేశారు.