శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ నటించి, నిర్మించిన చిత్రం ది లెజెండ్. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదలయ్యింది. సినిమాలపై మోజుతో శరవణ స్టోర్స్ అధినేత శరవణన్.. తానే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించి.. హీరోగా నటించాడు. ఇక ఆయన పక్కన రాయ్ లక్ష్మి, ఊర్వశి రౌతెలా హీరోయిన్‌లుగా నటించారు. భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఈ ఏడాదిలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక సినిమా మీద పాన్ ఇండియా రేంజ్‌లో చర్చ జరగుతోంది.. ట్రోలింగ్ కూడా విధంగా ఉంది. ఇక సినిమా మీద వచ్చిన మీమ్స్‌కయితే లెక్కేలేదు. వీటన్నింటి కన్నా బాగా.. ఓ వార్త జనాలను ఆకర్షించింది. అదేంటంటే.. ఈ సినిమాలో నటించేందుకు గాను ఊర్వశి రౌతెలా ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి..
ఈ క్రమంలో తాజగా ఈ వార్తలపై ఊర్వశి రౌతెలా స్పందించారు. మీ రెమ్యునరేషన్ 20 కోట్లు అట కదా.? అని ‘ది లెజెండ్’ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఊర్వశి రౌతెలాని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, నవ్వి ఊరుకుందామె. అయితే, తాజాగా బాలీవుడ్ మీడియా కూడా ఇదే విషయమై ఆమె నుంచి స్పష్టత కోరే ప్రయత్నం చేసిందట..ఈ సందర్భంగా ఊర్వశి రౌతెలా మాట్లాడుతూ.. ‘రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలనేది నిర్మాత నిర్ణయిస్తారు. 20 కోట్లు కాదు, పాతిక కోట్లు ఇచ్చినా తీసుకోవాలి కదా.. కానీ, అంత సీన్ లేదు..’ అని తేల్చేసిందట ఊర్వశి రౌతెలా. ‘ఇస్తే మాత్రం తీసుకుంటా..’ అని నవ్వేసిందట ఈ అందాల భామ. అంటే సినిమా కోసం ఊర్వవి రౌతెలాకు 20 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా ఇచ్చారనే వార్తలు అవాస్తవం అని క్లారిటీ వచ్చింది..!!