in

Urvashi Rautela Calls Pawan Kalyan The ‘Chief Minister Of Andhra Pradesh’!

సారి ఏపీ పాలిటిక్స్ లో ఏదో మార్పు తీసుకొచ్చేలానే కనిపిస్తున్న పవన్ గెస్ట్ రోల్ లో నటించిన “బ్రో” చిత్రం తాజాగా థియేటర్స్ లో ఐతే రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి మొన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగగా ఇందులో అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా పాల్గొంది.అయితే ఇది వరకే పవన్ తో నటించిన ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ని సోషల్ మీడియాలో పంచుకున్న

ఆమె లేటెస్ట్ గా సినిమా రిలీజ్ పై తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఒకింత షాకింగ్ గా మరియు వైరల్ గా మారింది. అయితే ఆమె తెలిసి అన్నదో లేదా తెలియక చేసిందో కానీ తన పోస్ట్ లో అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యిన పవన్ కళ్యాణ్ గారు అంటూ స్టార్ట్ చేసి తమ బ్రో సినిమా రిలీజ్ పై పోస్ట్ చేసింది. దీనితో ఇది ఒక్కసారిగా అందరిలో వైరల్ గా మారగా చిత్ర దర్శకుడు సముద్రఖని కూడా దానికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా రిప్లై ఇచ్చారు. దీనితో ఇపుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో అటు ఏపీ రాజకీయాల్లో కూడా ఊర్వశి రౌతేలా పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారిపోయింది…!!

delhi beauty ketika sharma acted with 3 mega heroes!

NOOTOKKA ZILLALA ANDAGADI MADRAS PRAYANAM!