in

delhi beauty ketika sharma acted with 3 mega heroes!

కేతిక శర్మ ..పూరి జగన్నాథ్ పరిచయం చేసిన ఢిల్లీ బ్యూటీ. ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుందరి. ఈ సినిమా సమయంలోనే కుర్రాళ్లంతా తన గ్లామర్ గురించి మాట్లాడుకున్నారు. ఇంతకాలం పాటు తెలుగు తెరపైకి రాకుండా ఏంచేస్తున్నట్టు? అంటూ చిటపటలాడారు. ఇక ఆమె ఏ సినిమా చేసినా ఫస్టు డే చూడవలసిందే అని ఫిక్స్ అయ్యారు. ‘రొమాంటిక్’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, యూత్ లో కేతికకి గల క్రేజ్ కారణంగానే ‘లక్ష్య’ .. ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలు వెతుక్కుంటూ వచ్చాయి.

అయితే ఆ సినిమాల ఫలితం కూడా కేతికను నిరాశ పరిచాయి. అయితే కథాకథనాల పరంగా ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయిగానీ, గ్లామర్ పరంగా కేతికకి పడవలసిన మార్కులు పడిపోయాయి.  అందువల్లనే ఇప్పుడు ఆమెకి ‘బ్రో’ సినిమాలో ఛాన్స్ దొరికింది. ఆల్రెడీ ‘వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన కేతిక, ఈ సినిమాలో పవన్ – సాయితేజ్ తో కలిసి నటించింది. దాంతో ఆమె చాలా తక్కువ సమయంలో ముగ్గురు మెగా హీరోలతో కలిసి నటించినట్టు అయింది. ఈ సినిమా హిట్ అయితే కేతికను వెతుక్కుంటూ మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి…!!

Prabhas FB Account Hacked, Viral Video Posted!

Urvashi Rautela Calls Pawan Kalyan The ‘Chief Minister Of Andhra Pradesh’!