in

Urfi Javed in for an item in Pushpa 2?

కాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు మొత్తం ఇండియా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అప్పుడెప్పుడో వచ్చిన గ్లిమ్ప్స్ మినహా అఫీషియల్ గా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. భారీ బడ్జెట్ తో సుకుమార్ పక్కా ప్లానింగ్ తో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి రీసెంట్ గా రిలీజైన వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు పుష్ప 2 గురించి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అదేంటంటే, ఈ సినిమాలో ఉర్ఫీ జావేద్ ఐటమ్ సాంగ్ చేస్తోందట. పార్ట్ 1లో సమంత చేసిన సాంగ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ న్యూస్ షాకింగ్ అనే చెప్పాలి. పాన్ ఇండియా సెన్సేషన్ అయిన ఈ మూవీలో ఐటమ్ సాంగ్ అంటే స్టార్ హీరోయిన్స్ సైతం డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఈ డర్టీ బ్యూటీని సెలెక్ట్ చేయటం ఎందుకని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి, ఈ న్యూస్ లో నిజమెంతో, ఉర్ఫీ జావేద్ ని టాలీవుడ్ ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి..!!

ranbir Kapoor As Lord Ram & Sai Pallavi As Sita?

Chiranjeevi In mass Boyapati Srinu Direction?