in

ranbir Kapoor As Lord Ram & Sai Pallavi As Sita?

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటికే రామాయణం గురించి చాలా సినిమాలు వచ్చాయి. తెలిసిన కథే అయినా ఒక్కొక్కరు ఒక్కో కోణంలో సీతారాముల కథను చెప్పారు. ఇక ఇటీవలే ఆదిపురుష్​ మూవీ కూడా రామాయణం బ్యాక్​గ్రౌండ్​తోనే వచ్చింది. అయితే ఇప్పుడు రామాయణంపై  తెరకెక్కనున్న మరో సినిమా గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్​ దర్శకుడు నితేశ్​ తివారీ రామాయణంపై సినిమా తీయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాముడు, సీత, రావణుడి పాత్రలో ఏయే తారలు కనిపించనున్నారంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఓ జాబితా నెట్టింట వైరల్ అవుతోంది కూడా. అయితే ఇంతకముందు సీతారాములుగా ఆలియా-రణ్​బీర్, రావణుడిగా కేజీయఎఫ్ యశ్ పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆలియా స్థానంలో టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి తీసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు రావణుడిగా హీరో యశ్​ పేరు కన్ఫామ్ అయినా..ఆ తర్వాత ఆయన ఈ సినిమా చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రావణాసురుడిగా నటించేందుకు తాజాగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట..!!

is meenakshi chowdary the new hot tollywood’s favorite?

Urfi Javed in for an item in Pushpa 2?