in

UPPENA BEAUTY IN FOR SUDHEER BABU’S NEXT!

యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల ‘వి’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.`వి` చిత్రానికి మిశ్రమ స్పందనలు రాగా సుధీర్ బాబు కాప్ రోల్ కి మంచి పేరొచ్చింది. ఈ సినిమా లో సుధీర్ బాబు యాక్టింగ్ కు అభిమానులు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత పలాస దర్శకుడు కరుణ కుమార్ తో సినిమా ను అనౌన్స్ చేసాడు సుధీర్. శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఇదిలా ఉంటే తనతో రెండు సినిమా చేసిన మోహన్ కిష్ణ ఇంద్రగంటి తో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు సుధీర్ బాబు.

దీపావళి కానుకగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు – కిరణ్ బాలపల్లి నిర్మించనున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది. ఉప్పెన సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకపోయినా ఈ చిన్నదానికి అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. మరి ఈ మలయాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎలా రాణిస్తుందో చూడాలి

nazriya confirms her first straight telugu film!

AMMAI KOSAM THIRUPATHI KU VELLI GUNDU KOTTINCHUKUNNA Kartikeya!