టీవీ టవర్ అనగానే గుర్తొచ్చే హీరో వేణు.ఈయన పూర్తి పేరు తొట్టెంపూడి వేణు.ఎన్నో హిట్ మూవీస్ నటించి ఆడియెన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు.స్వయంవరం సినిమాతో తుఫాన్ లా దూసుకొచ్చిన హీరో వేణు కొద్ది కాలం లోనే మినిమం గ్యారెంటీ హీరో గా మారిపోయాడు. ఫ్యామిలీ హీరో గా పేరు తెచ్చుకున్న వేణు కామెడీ చిత్రాల్లో కూడా తనదైన శైలిలో మెప్పించాడు.
అయితే ఈ మధ్య కాలంలో వేణు సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు.ఇతరి హీరోల నుండి వచ్చే పోటీని తట్టుకోలేక ఓ దశ లో కేరెక్టర్ రోల్స్ తో సరిపెట్టుకున్నాడు.ఆ తరువాత రామాచారి చిత్రంతో హీరో గా చివరి ప్రయత్నం చేసి విఫలం అవ్వడం తో ఇంక సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు.
వేణు కి 2001 లో పెళ్లి అయింది…వేణు భార్య అనుపమ చౌదరీ చెన్నై కు చెందిన అమ్మాయి.మద్రాస్ యూనివర్సిటీ లో ఎం.బి.ఎ చేసిన అనుపమ,పెళ్లి తరువాత తన భర్త వేణు తో కలిసి వ్యాపార రంగంలో బిజీ అయ్యింది.ఆమె స్క్రాప్ బుకింగ్ అని కొత్త అర్టిస్తిక్ వ్యాపారం ప్రారంభించింది.స్క్రాప్ బుకింగ్ అంటే ఒక వ్యక్తి జీవితంలోని ముఖ్య ఘట్టాలను చిత్రం రూపంలో ఒక ఆల్బమ్ లో అందంగా ప్రెసెంట్ చెయ్యడం.ఇప్పుడు సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో ఈ స్క్రాప్ బుకింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.భార్య తో కలిసి వ్యాపారం లోకి దిగిన వేణుకి సినీ పొలిటికల్ బిజినెస్స్ రంగంలో చాలా మంది ప్రముఖులు వినియోగదారులు గా ఉన్నారు.కొన్ని నెలలు క్రితమే రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా దందులూరు గ్రామానికి విచ్చేశారు.అక్కడ భాస్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన అతిపెద్ద జాతీయ జెండాను సందర్శించాడు.ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ మంచి పాత్రలు వస్తె తాను నటించడానికి సిద్దంగా ఉన్నాను అని తెలిపాడు.