in

‘tuck jagadish effect’, vijay keeps shiva nirvana on hold!

విడుదల కి ముందు వరకు నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని నిరాశ చెందిన అభిమానులే సినిమా విడుదల అయ్యాక మాత్రం సినిమాని థియేటర్ లలో విడుదల చేయకపోవడమే మంచిది అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోటీన్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షాదరణ అంతగా పొందలేదు అనే చెప్పాలి. ఇక నాని తదుపరి సినిమా ఎవరితో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మరోవైపు శివ నిర్వాణ తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమా మాత్రం ఒక ప్రేమకథగా ప్రేక్షులముందుకు రాబోతున్నట్టు సమాచారం. కానీ తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ తో చేయాల్సిన సినిమాని హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. దానికి కారణం “టక్ జగదీష్” సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకొకపోవడమే అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. నిజానికి “లైగర్” సినిమా తర్వాత విజయ్ శివ నిర్వాణ తోనే సినిమా చేయాలని అనుకున్నారు కానీ “టక్ జగదీష్” సినిమా తర్వాత శివ నిర్వాణ తో సినిమాని అటకెక్కించారు విజయ్.

Anchor Rashmi Gautam Gets Serious On Rajinikanth Fans!

bubbly beauty namitha attends an event!