in

ts minister KTR’s Curious Comments On Prabhas’ ‘Adipurush’!

బీజేపీ తన భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం సినీ రంగాన్ని వాడుకుంటోందన్నారు. ‘ఉరి: సర్జికల్ స్ట్రైక్’, ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రాలను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించిన ఆయన.. ప్రభాస్ సినిమా పేరును సైతం ఈ జాబితాలోకి చేర్చారు. ప్రభాస్ తాజాగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ బీజేపీ మత ప్రచారంలో భాగమే అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘హిందుత్వ అజెండా, పార్టీ ఐడియాలజీని ప్రచారం చేయడం కోసం ఆదిపురుష్ సహా 15-16 సినిమాలను బీజేపీ రూపొందిస్తోంది.

వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఇమేజీ పెంచేలా ఈ సినిమాలు రిలీజవుతాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలనుకుంటున్న ప్రధాన రాష్ట్రాలకు చెందిన నటులు ఈ సినిమాల్లో ఉంటారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బాహుబలితో ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్.. శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణంలోని కీలక అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి విడుదలకు సిద్ధమవుతోంది..

Kiara Advani reacts to question about break-up rumors!

telugu beauty Tejaswi Madivada Stills in red dress!