in

trivikram to work with this 3 heroes next?

లేటెస్ట్ గా  మహేష్ బాబు హీరోగా  గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శల పాలయ్యాడు. త్రివిక్రమ్ మార్క్ సినిమా లా లేదని, కనీసం గుర్తు పెట్టుకోవాల్సిన డైలాగ్స్ కూడా లేవని ట్రోల్ చేసారు. దీనితో త్రివిక్రమ్ నెక్స్ట్ బన్నీతో చేయబోయే సినిమా ఆగిపోయిందని రకరకాల వార్తలు వినిపించాయి. కానీ త్రివిక్రమ్ ఇప్పుడు ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాడని టాక్. గుంటూరు కారం సినిమా టైమ్ లో బన్నీతో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు..

ఆ మూవీ ఆగిపోలేదని, బన్నీ పుష్ప 2 కంప్లీట్ చేసాక ఈ మూవీ మొదలవుతుందని సమాచారం. ఇది కాక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో త్రివిక్రమ్ ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కించే దశగా చర్చలు జరుగుతున్నాయి. వీటితో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో  త్రివిక్రమ్ ఒక సినిమా చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు చెర్రీ, త్రివిక్రమ్ సినిమా రాలేదు. మెగా ఫాన్స్ వీరి కాంబో కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు..!!

Ravi Teja’s ‘tnr’ first ever indian film to release in the sign language!

COMEDY KING WITH GOLDEN HEART!