త్రిష సినీ కెరీర్ సాఫీగానే సాగుతున్న పర్సనల్ లైఫ్ లో అనేక అవరోధాలు వచ్చాయి. ఓ సారి త్రిష బాత్ రూం వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా, అప్పుడు త్రిష చాలా బాధపడింది. ఇక చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం వరకు వెళ్లినా.. అదిపెళ్లి పీటల వరకు వెళ్లకపోయే సరికి హర్ట్ అయింది. కొన్ని రోజుల వరకు ఆ షాక్ నుండి కోలుకోలేకపోయింది. ప్రస్తుతం త్రిషకు 37 ఏళ్లు కాగా, మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోమని అభిమానులు సలహాలు ఇస్తున్నారు.
కొద్ది రోజులుగా త్రిష, శింబులు ప్రేమాయణం నడుపుతున్నారనే వార్త కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తుంది. ఈ నోట ఆ నోట పడి చివరకు త్రిష వరకు ఈ విషయం చేరడంతో వెంటనే స్పందించింది. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పక పెళ్లి చేసుకుంటాను. అర్దం చేసుకునే వ్యక్తి దొరికితేనే నా వైవాహిక జీవితం ప్రారంభం అవుతుంది. లేదంటే అప్పటి వరకు సింగిల్‌గానే ఉంటాను అంటూ త్రిష కామెంట్స్ చేసింది. ఈ అమ్మడికి మంచి అబ్బాయి దొరకుతాడు అంటూ అభిమానులు ధైర్యం చెబుతున్నారు.