తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు నటన గురించి ఏం తెలియదన్నారు. చదువులో రాణించలేకపోయాను. దీంతో మోడలింగ్ వైపు రావాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెబితే వారు అంగీకరించలేదు. అయినా పట్టుదలతో అడుగుపెట్టాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఫొటోగ్రఫీ డైరెక్టర్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే ఏంటో తెలియదు..
అప్పటికి నేను నటనలో కనీసం ఓనమాలు కూడా నేర్చుకోలేదు. విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నా. తోటి నటీనటులతో కలిసి ప్రతీ సన్నివేశాన్ని చర్చించేదాన్ని. ఇక్కడికి వచ్చి సరైన నిర్ణయం తీసుకున్నానా అని ఎన్నోసార్లు ఆలోచించాను. ‘లైలా మజ్ను’ సమయంలో సెట్స్‌లో ప్రతిరోజూ ఏడ్చేదాన్ని. వాళ్లు చెప్పే భాష నాకు అర్థమయ్యేది కాదు. ఇంటికెళ్లి పాత్ర డైలాగులు ప్రాక్టీస్ చేసేదాన్ని’ అంటూ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు..!!