10. JIL
బాహుబలి సినిమా చేస్తున్న సమయంలో జిల్ మూవీ డైరెక్టర్ రాధకృష్ణ సినిమా స్టోరీ ను ప్రభాస్ కు వినిపించడం జరిగింది…అయితే అతనని వెయిట్ చేయించడం ఇష్టం లేక ప్రభాస్ స్నేహితుడు అయిన గోపీచంద్ కు చేయుమని చెప్పాడట.
09. OOSARAVELLI
ఊసరవెల్లి సినిమా హిట్ అవ్వకపోయినా హీరో ఎలివేషన్స్ చాలా బావుంటాయి, ఈ కథ ను కూడా ప్రభాస్ రిజెక్ట్ చెయ్యడంతో ఎన్ టి ఆర్ చేతిలోకి వెళ్ళింది.
08. DON SEENU
డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రభాస్ నటించిన బుజ్జిగాడు కేరెక్టర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని డాన్ శీను కథను రాసుకోవడం జరిగింది.ఇంచుమించు ఒకేలా ఉండడంతో ఈ సినిమాను కూడా రిజెక్ట్ చెయ్యడం జరిగింది.
07. KICK
కిక్ సినిమాను కూడా ప్రభాస్ రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది.ముందు కిక్ కథ ను ప్రభాస్ కు వినిపించడం జరిగిందట. కాని ప్రభాస్ ఒకే చెప్పే లోపే అప్పటికే పిచ్చ ఫామ్ లో ఉన్న రవితేజ ను ఫైనల్ చేసుకున్నాడు సురేందర్ రెడ్డి.
06. BRUNDAVANAM
ప్రభాస్ కు “మున్నా” లాంటి ఫ్లాప్ మూవీ ను ఇచ్చిన వంశీ పైడపళ్లి…అదే గిల్ట్ ఫీలింగ్ తో “బృందావనం” కథ ను ప్రభాస్ కు వినిపించాడు…కానీ అప్పటికే ‘డార్లింగ్’ మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలు ఒప్పుకోవడం తో ఆ సినిమాను కూడా ప్రభాస్ చెయ్యలేదు.
05. DIL
ఈశ్వర్ సినిమా నుండి వినాయక్,ప్రభాస్ మధ్య మంచి స్నేహం ఉంది..దాంతో మొదట వినాయక్ దిల్ కథను ప్రభాస్ కు వింపించాడు.కానీ వేరే సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ కథను రిజెక్ట్ చేశాడు.
04. NAYAK
మొదట నాయక్ కథను ప్రభాస్ విన్నాడు.కానీ అతను ఆ కథను రిజెక్ట్ చేశాడు.ఆ తరువాత అదే కథ పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళింది.కానీ ఏమైందో ఎంటో నాయక్ సినిమాను రామ్ చరణ్ చెయ్యడం జరిగింది.
03. AARYA
ఈ కథను ప్రభాస్ ఒక్కడే కాదండీ అల్లరి నరేష్ కూడా రిజెక్ట్ చెయ్యడం జరిగింది…దాంతో అల్లు అర్జున్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు.
02. SIMHADRI
రాజమౌళి ‘సింహాద్రి’ కథను మొదటగా ప్రభాస్ కే వినిపించాడు.ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే స్టూడెంట్ నంబర్ వన్ సినిమా చూస్తే చాలా క్లాస్ గ ఉంటుంది ఈయన మాస్ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేయగలడా లేదా అని రిజెక్ట్ చేసాడంట మన డార్లింగ్.
01. OKKADU
ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.దర్శకుడు గుణశేఖర్ ప్రభాస్ ,కృష్ణంరాజు లను కలిసి కథ వినిపించాడట.అయితే కబడ్డీ గేమ్ అంటున్నారు స్క్రిప్ట్ కూడా కొంచెం రిస్కీ గా అనిపించడంతో ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది.