in

TOP 10 BEST TELUGU MOVIES IN 2019!

10. మజిలీ

సినిమాలో నిజ జీవితంలో జంట అయిన చైసాం లు ఆన్ స్క్రీన్ జంటగా నటించారు.వీరిద్దరూ కలిసి సినిమాలో పాత్రలకు ప్రాణం పోసారు.వీరిద్దరే కాదండీ దివ్యాన్ష కౌషిక్,రావు రమేష్,పోసాని మురళి కృష్ణ, సుహస్,మహేష్ ఆచంట అందరూ చాలా బాగా నటించారు.అందుకే సినిమా అంతా గణ విజయం సాధించింది.

09. చిత్రలహరి

సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రయదర్శన్, నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మంచి సోషల్ మెసేజ్‌తో అద్భుతమైన డైలుగులతో కూడిన ఈ మూవీ యువతను ఆకట్టుకుంది. 2019లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి.

08. మహర్షి

హేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కిన సినిమా మహర్షి.మహేష్ బాబు కెరీర్ లో ఒక మైలు రాయి గా నిలించ చిత్రం ఇది.మహేష్ బాబు ఇమేజ్ ను డబుల్ చేసింది మహర్షి.

07. ఓ బేబి

మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘ఓ బేబి’ చిత్రంలో సమంత అక్కినేని, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషించారు. దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా సమంతా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

06. ఎవరు

సంవత్సరంలో తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలను అందుకున్న సినిమాలలో ఎవరు ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

05. బ్రోచేవారరెవరురా

సంవత్సరంలో మనకు కొత్తగా అనిపించే సినిమాలలో బ్రోచేవారరెవరురా సినిమా ఒకటి.ఈ సినిమా లో ఉన్న ప్రతీ కేరక్టర్ కి ప్రాధాన్యత ఉంటుంది.ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది.

04. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ

డిటెక్టివ్ పాత్రలు,నేర పరశోధన లు కలిగి ఉన్న సినిమా వచ్చి చాలా యేళ్లు అవుతుంది.2019 లో వచ్చిన సినిమాలలో ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ గా నిలిచింది.సినిమాకు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు కలెక్ట్ చేసిన సినిమా ఇది.

03. మల్లేశం

ల్లేశం ఒక బయోపిక్.బయోపిక్ ను నిజాయితీగా చూపించడం అంటే ఇదేనేమో అన్నట్టుగా తెరకెక్కించారు మల్లేశం సినిమాను.మనకి స్క్రీన్ పైన ప్రియదర్శి కాకుండా మల్లేశం కనపడతాడు అంటే నమ్మండి… సినిమాను అంత బాగా ప్రెసెంట్ చేశారు మరీ !

02. జెర్సీ

2019 లో మోటివేషన్ ఇచ్చి మనల్ని ఇన్స్పైర్ చేసే సినిమాల్లో జెర్సీ ముందు వరసలో ఉంటుంది.వయసుకి ఒక లక్ష్యం అడ్డు కాదు అని నిరూపించిన సినిమా జెర్సీ.అర్జున్ గా నేచురల్ స్టార్ నాని నటన గౌతమ్ డైరెక్షన్ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.

01. సైరా నరసింహ రెడ్డి

సైరా నరసింహ రెడ్డి తొలి స్వాతంత్ర సమర యోధుడి ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి కథతో రూపొందిన చిత్రం.ఈ సినిమా 2019 లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

TOP 10 MOVIES OF THE DECADE YOU MUST NOT SEE WITH YOUR PARENTS!

MAHESH BABU’S FANS FIRE !