in

Tollywood Unmarried Actresses!

మూడు పదుల వయసు దాటిన అసలు పెళ్లి అనే టాపిక్ ఎత్తకుండా లైఫ్ ని సింగల్ గ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్ వీరే!!

* అనుష్క శెట్టి : ‘సూపర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మన స్వీటీ ఇప్పటి వరకూ పెళ్ళిచేసుకోలేదు. ‘ప్రభాస్ తో లవ్ లో ఉంది’ అంటూ వార్తలు వస్తున్నా ‘అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టి పారేస్తూ వస్తుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన మన స్వీటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

* త్రిష కృష్ణన్ : తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న వారిలో త్రిష కూడా ఒకరు. ఇప్పటికి ’96’ వంటి సూపర్ హిట్లతో అలరిస్తూనే ఉన్న త్రిష.. 30 దాటినప్పటికీ పెళ్ళిచేసుకోలేదు.

* నయన తార : తమిళ్తో పాటు తెలుగులో కూడా నయన తార స్టార్ హీరోయిన్ గా కొనసాతుంది. ఈమె చిన్న సినిమా చేసినా.. స్టార్ హీరో సినిమా చేసినా రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. ‘గ్యాంగ్’ ఫేమ్ విగ్నేష్ శివన్ తో డీప్ లవ్ లో ఉంది. త్వరలో పెళ్ళిచేసుకుంటాను అని చెప్తున్నారు కానీ.. ఇంకా చేసుకోలేదు.

* శృతి హాసన్ : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది శృతి హాసన్. ఈమె మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 30 ఏళ్ళు దాటినా ఈమె ఇంకా పెళ్ళి చేసుకోకపోవడం విశేషం.

* కాజల్ అగర్వాల్ : కాజల్ కూడా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తన చెల్లి నిషా అగర్వాల్ పెళ్ళి చేసుకున్నా.. ఇంకా కాజల్ మాత్రం పెళ్ళిచేసుకోలేదు. కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్ళెందుకు అని అనుకుంటుందో ఏమో..!

* తమన్నా : ‘శ్రీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పటికీ క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. హిట్లు ఎక్కువ లేకపోయినా అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోలందరి సరసన నటించేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈమె కూడా 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళికి నో అంటుంది.

* ఇలియానా : ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా.. ఇప్పటికీ బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టు లు చేస్తూ బిజీగా గడుపుతుంది. 32 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి పెళ్ళి చేసుకోలేదు ఈ భామ.

* తాప్సి పన్ను : దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది తాప్సి. కానీ తెలుగు కంటే ఈ అమ్మడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 32 ఏళ్ళు వచ్చినా.. ఈ అమ్మడు ఇంకా పెళ్ళి చేసుకోలేదు.

MAHESH FANS VS VIJAY FANS!

SHRIYA CHALLENGE TO BUNNY!