in

TOLLYWOOD SENTIMENT: Worst Curse For Rajamouli Heroes!

రాజమౌళిపై ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఏ హీరో అయినా అతడితో సినిమా తీస్తే అది పెద్ద హిట్టవుతుంది. ఆ హీరో కెరీర్ బెస్ట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ తర్వాత మాత్రం సదరు హీరోకు వరుసగా ఫ్లాపులొస్తాయి. ఇదీ రాజమౌళిపై ఉన్న నెగెటివ్ సెంటిమెంట్. ఇప్పుడీ సెంటిమెంట్ మరోసారి నిజమైందంటున్నారు జనాలు. ఆచార్య సినిమాను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు రామ్ చరణ్. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా రిలీజైంది. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో రాజమౌళి నెగెటివ్ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొస్తున్నారు చాలామంది.

ఆచార్యతో ఆ సెంటిమెంట్ మరోసారి కొనసాగిందని అంటున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా చేశాడు ప్రభాస్. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు చూశాడు. కొన్నేళ్లకు బాహుబలి ఫ్రాంచైజీ చేశాడు. ఆ తర్వాత కూడా సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. రవితేజ, నాని, ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో కూడా మరోసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అయిందని అంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ లోనే రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేశాడు చరణ్. ఆ తర్వాత అతడు చేసిన ఆరెంజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యతో ఫ్లాప్ ఫేస్ చేశాడు చరణ్. ఈ సెంటిమెంట్ కు ఎవరు బ్రేక్ వేస్తారో చూడాలి.

Urfi Javed compares her fashion sense to Samantha!

venkatesh Making His Bollywood Comeback With Salman Khan!