in

Tollywood biggies postpone promotions after lyricist Sastry’s demise!

నారోగ్య సమస్యలతో కన్నుమూసిన పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఫిలిం ఛాంబర్ కు తరలించి.. సందర్శనార్థం అక్కడ ఉంచారు. ఈ నేపథ్యంలో పలువురు నటీనటులు ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు సిరివెన్నెల మృతి కారణంగా కొన్ని సినిమా అప్డేట్స్ రిలీజ్ ను ఆపేస్తున్నట్లు ఆయా చిత్ర నిర్మాణసంస్థలు వెల్లడించాయి.

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో డిసెంబరు 1న ‘అడవి తల్లి మాట’ అనే సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనూహ్య మరణం కారణంగా పాట రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ట్విట్టర్ లో ప్రకటించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఫ్యాన్స్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేసింది చిత్ర బృందం. కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 3 న విడుదల కావాల్సిన ట్రైలర్ ను విడుదల వాయిదా వేసుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. త్వరలోనే ట్రైలర్ కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని స్పష్టం చేసింది చిత్ర బృందం. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ లో నిరాశ మిగిలింది. కాగా… ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

I don’t like Raj Tarun at all, Ariana shocking comments!

bangaram beauty meera chopra latest photoshoot stills!