PATHOS RAAGA SIVARANJANI FOR DUET???
ఇసై జ్ఞానీ (సంగీత జ్ఞానీ) ఇళయ రాజా, తన ప్రతిభ తో ఎదిగిన సంగీత దర్శకుడు, ఎక్కడో మారుమూల గ్రామం నుంచి, హార్మోనియం భుజానికి తగిలించుకొని అప్పటి మద్రాసు పట్టణం చేరుకొని, ఎన్నో ఆకలి అనుభవాలు, నిద్ర లేని రాత్రుల నుంచి ఎదిగిన కర్మ జీవి. వామ పక్ష భావజాల వేదికల నుంచి తన సంగీత ప్రస్థానం ప్రారంభించి, తనని, తాను మలుచుకుంటూ సంగీత జ్ఞానీ గ ఎదిగిన తీరు ప్రశంసనీయం. భుక్తి కోసం మద్రాసు మీరిన [...]