in

Tiger Shroff Car Attack: Bishnoi Gang Claims Firing

Tiger Shroff Car Attack

ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తుండగా, టైగర్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో ఆయన చేతికి స్వల్పంగా గన్‌పౌడర్ గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్‌కు గాయాలు కావడంతో వారిని నానావతి ఆసుపత్రికి తరలించారు..దాడి తర్వాత నిందితులు తమ ద్విచక్ర వాహనాన్ని అంధేరి స్టేషన్‌లో వదిలి పారిపోయారు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దాని నంబర్ ప్లేట్, ఛాసిస్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్లు అనిల్ పండిట్, హర్మాన్ సంధు..లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.!!

22 years for ’MANASANTHA NUVVE!

Neha Sharma issues stern warning over AI videos using her face!