in

thrutilo bollywood ranga pravesham miss chesukunna balayya!

బాలీవుడ్ రంగ ప్రవేశం తృటిలో మిస్ అయిన బాలయ్య బాబు. బాలయ్య బాబు నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం హిందీ లో డబ్ చేసి, ఏకంగా పదిహేడు సెంటర్స్ లో రిలీజ్ చేస్తే విజయ ఢంకా మోగించింది. దానితో నిర్మాత ఏ.ఏం. రత్నం బాలయ్య తో తెలుగు, హిందీ భాషలలో ఒక భారీ చిత్రం తీయాలని సంకల్పించారు. అది 1991 వ సంవత్సరం, తేజాబ్ ఫేమ్ యెన్.చంద్ర ని డైరెక్టర్ గ తీసుకున్నారు, కథ చర్చలు జరిగాయి, కధ ఫైనలైజ్ అయింది. బాలయ్య సరసన హీరోయిన్ గ మాధురి దీక్షిత్ ను ఒప్పించారు యెన్. చంద్ర.

అదే సందర్భం లో యెన్. చంద్ర వేరే ప్రాజెక్ట్ తో బిజీ అయ్యారు, ఈ సినిమా కాస్త వాయిదా పడింది. ఆ తరువాత యెన్.చంద్ర ఫ్రీ అయ్యారు, కానీ బాలయ్య బాబు బిజీ గ ఉండటం తో ఆ ప్రాజెక్ట్ అటక ఎక్కింది. లేకుంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాగా బాలయ్య బాబు కూడా హిందీ చిత్రసీమలో తన సత్తా చాటి ఉండేవారు. ఆ విధంగా నందమూరి నట సింహం బాలీవుడ్ రంగ ప్రవేశం నెరవేరని కలగా మిగిలింది. ఇక ముందు ఏదయినా హిందీ సినిమా చేస్తారేమో బాలయ్య బాబు, వెయిట్ అండ్ సి.

Whopping 8000 VFX shots in Prabhas’s Adipurush!

Boxing Legend Mike Tyson Teams Up With Vijay Deverakonda!