in

Three Chief Guests For ‘pushpa’ pre release event?

త ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరులో రాబోతున్న అతి పెద్ద భారీ చిత్రమే కాదు…మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే వినవస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముగ్గురు ముఖ్య అతిథులు పాల్గొనబోతున్నారట.

ఈ వేడుకకు బన్నీ ప్రభాస్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే…అల్లు అరవింద్ తన హిందీ సినిమా ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్‌ని ముఖ్య అతిథిగా తీసుకురాబోతున్నాడట. వీరే కాకుండా మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ గ్యాప్ చూసుకుని గెస్ట్ గా హాజరుకాబోతున్నట్లు వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ ఏడాది జరిగే అతి పెద్ద పంక్షన్ గా నిలిచిపోతుంది. ఇటీవల బాలకృష్ణ ‘అఖండ’కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరుకావటం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటం జరిగింది. మరి బన్నీ సినిమాకు నిజంగా ముగ్గురు ముఖ్య అతిథులు హాజరైతే రచ్చ రచ్చే. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Destiny has the last laugh, says Priyanka Jawalkar!

rachana maurya latest photoshoot in saree!