in

Destiny has the last laugh, says Priyanka Jawalkar!

ప్రియాంక జవాల్కర్ ఈ సీజన్‌లో సినిమా షూటింగ్‌లు మరియు తన రాబోయే చిత్రాల ప్రమోషన్‌లతో బిజీగా ఉన్నారు. కానీ ఆమె మిగతా హీరోయిన్స్ తో పోల్చితే తన ఇన్‌స్టాగ్రామ్ లో తక్కువ గానే ఫొటోస్ ని షేర్ చేస్తుందనే చెప్పాలి . నటి తన రాబోయే చిత్రం ‘గమనం’ గురించి చాలా ఉత్సాహంగా ఉంది, మూడు విభిన్న కథల సంకలనమే ఈ చిత్రం. ప్రియాంక ఒక ముస్లిం అమ్మాయి జారా పాత్రను పోషించింది, ఆమె ఒక సాంప్రదాయక ముస్లిం కాలేజీకి వెళ్ళే అమ్మాయి, ఆమె ఒక క్రికెటర్‌తో ప్రేమలో పడుతుందని.  ఆ  క్రికెటర్‌ పాత్రను శివ కందుకూరి పోషించదని తెలిపింది.

‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే కథ ఇది. జారా తక్కువ మాట్లాడుతుంది, ఆమె తన భావాలను కళ్ళతో తెలియజేస్తుంది. నా చిన్ననాటి రోజుల్లో మా ఇరుగుపొరుగున చూసి పెరిగిన ముస్లిం కుటుంబాలు నాకు గుర్తున్నాయి. ఆ విధంగా, నేను జారా పాత్ర యొక్క చర్మంలోకి ప్రవేశించగలిగాను అని తెలిపింది.ఈ  లీడ్ పెయిర్ ఇంటి నుండి మరియు తల్లిదండ్రుల నుండి తలెత్తే వివిధ విభేదాలతో పోరాడి ఎలా విజయం సాధించారు అన్నదే మూవీ అని తెలిపింది. తన క్రికెట్ కెరీర్‌లో రాణించాలంటే జారా తన బాయ్‌ఫ్రెండ్‌కు మద్దతు ఇవ్వాలి” అని ఆమె చెప్పింది.

Pushpa Official Trailer, Allu Arjun, Rashmika, Sukumar!

Three Chief Guests For ‘pushpa’ pre release event?