నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యం తో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే !!” చిత్తూరు వి. నాగయ్య గారు తొలితరం హీరోలలో అగ్రగణ్యులు, 1950 లోనే లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరో. సినిమా నిర్మాణం లో అడుగుపెట్టి సర్వం కోల్పోయారు, అయన వ్యసనపరుడు కాదు, వారికీ ఉన్న ఒకే ఒక్క బలహీనత దానం చేయటం, వచ్చిన వారికీ కడుపు నిండా భోజనం పెట్టటడం, అందరిని అమాయకంగా నమ్మారు, చుట్టూ ఉన్న వారందరు మంచివారు అనుకొనే వారు, నిర్మాత గ ఔట్డోర్ షూటింగ్ లో ఉన్నప్పుడు, సినిమా యూనిట్ వారితోపాటు షూటింగ్ చూడటానికి వచ్చిన వారికీ కూడా భోజనం పెట్టిన దయార్ద్ర హ్రిదయమ్ ఆయనది.
అందరు బాగుండాలి అనుకునే పాత తరం మనస్తత్వం ఆయనను ఆర్ధికంగ కృంగ దీసింది, వయసుతోపాటు, ఆస్తులు కూడా కరిగిపోయి, చివరకు భుక్తి కోసం ఐదు వేల కు కూడా వేషం వేసే స్థాయి కి చేరుకున్నారు. అయినా కూడా అయన ఏ రోజు ఎవరిని నిందించలేదు, ఆ రాముడు మనకు ఎంత ప్రాప్తమో అంతే ఇస్తాడు నాయన అనే వారు. అటువంటి మహానుభావుడు మరణించిన రోజు, ఆయనను చివరి మజిలీ చేర్చేందుకు కూడా చేతిలో డబ్బు లేని పరిస్థితి, నాగయ్య గారిని చివరి చూపు చూడటానికి వచ్చిన ఎం.జి.ఆర్. గారు విషయం తెలుసుకొని కన్నీటితో ఆ ఖర్చును తానే భరించి నాగయ్య గారి అంత్య క్రియలు చేయించారు. విధి ఇంత కర్కశం గ కొంత మందిని ఎందుకు ఆలా కాటేస్తుందో ? రాబోయే తరాలకు పాఠం నేర్పడానికా ? లేక ఉదాహరణలు చూపడానికా ?