షకలక శంకర్, తన నటనతో, శ్రీకాకుళం మాండలికం తో, రాంగోపాల్ వర్మ ను అనుకరించటం తో మంచి గుర్తింపు పొందిన కమెడియన్. శంకర్ ఇక లేడు అని ఫోటో కి దండ వేసి, భోజనాలు పెట్టేసారు 2008 కి ముందు.ఎందుకు ఆలా చేసారు శంకర్ ఇంట్లో వాళ్ళు తెలుసా ? టెన్త్ ఫెయిల్ అయిన శంకర్ సినిమాలో ఏదో ఒక పని చేసి పేరు సంపాదించాలి అని హైదరాబాద్ చేరాడు, ఆ ప్రయత్నం లో ఎనిమిది సంవత్సరాలు ఇంటి ముఖం చూడలేదు, ఇంట్లో వాళ్ళు సోదులు, జోతిష్యాలు ,అంజనాలు వేయించి ఆచూకీ లేక పోవడం తో ఫోటో కి దండ వేసేసారు. 2008 లో నోట్ బుక్ అనే సినిమా లో నటించే అవకాశం వచ్చిన శంకర్ రాజముండ్రి వెళ్లారు, ఆ టైం లోనే శంకర్ వాళ్ళ నాన్న గారు కూడా ఏదో పని మీద అక్కడకు వచ్చారు.