రాశి ఖన్నా ఈ అందాల ముందు గుమ్మా తెలుగు సినిమా లో కి వచ్చి చాల కాలం అయింది , తన అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది ఈ బబ్లీ బ్యూటీ. ఇటీవల మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా తో హిట్ అందుకుంది. ఆతర్వాత ‘వెంకీమామ’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అయితే ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొట్టింది. ఇక ఈభామ మొదటినుంచి గ్లామర్ షోతో ఆకట్టుకుంటూనే ఉంది.
అయితే రాశి తమిళ్ లో సూర్య సరసన “అరువా” సినిమాలో నటిస్తుంది. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. ఇక ఈ సినిమాలో రాశిఖన్నా బికినీలో కనిపించనుందని తెలుస్తుంది. గతంలో రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాలో రాశి బికినీలో కనిపించింది.ఆ మధ్య బికినీతో ఫోటోషూట్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మళ్ళీ సూర్య సినిమా కోసం బికినీలో కనిపించి కనువిందు చేయనుందని తెలుస్తుంది.