in

this is why samantha is known for her fitness obsession!

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. క్రమం తప్పకుండా చేసే పనుల్లో ఒకటి వ్యాయామం. ఎందుకంటే సహజంగానే ఆమె ఫిట్నెస్ ఫ్రీక్. వ్యాయామం ఆమె దినచర్యలో భాగం. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సామ్‌.. తాను చేసే జిమ్‌ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలను ఎప్పుడూ సోషల్‌మీడియాలో పంచుకుంటుంది. గతంలో 100 కిలోల బరువున్న బార్బెల్‌ను సులువుగా ఎత్తి ఆశ్చర్యపరిచింది. స్క్వాట్స్, ఏరోబిక్స్, యోగా, జిమ్, వెయిట్ లిఫ్టింగ్.. ఇలాంటివన్నీ చేస్తూ అందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో సమంత కఠిన కసరత్తులు చేస్తూ.. చెమటలు చిందిస్తుంటుంది. తాజాగా మరో కొత్త వీడియోను పోస్ట్ చేసింది..

ఇందులో సామ్..బ్యాక్ వర్కౌట్ చేస్తూ కనిపించింది. ఇట్స్ ఏ సాంగ్ బేబి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. తెగ లైక్స్, కామెంట్స్ వస్తన్నాయి. కాగా, మయోసైటిస్‌ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై దృష్టి పెడుతోంది సమంత. ఓవైపు శాకుంతలం ప్రమోషన్స్‌, మరోవైపు సిటాడెల్‌ షూట్‌తో సామ్‌ కొత్త ఏడాదిని ప్రారంభించింది. ఇంకా సామ్‌ రానున్న రోజుల్లో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లపైనే ప్రత్యేకంగా దృష్టి సారించనున్నందని, అందుకు అనుగుణంగా ముంబయిలో ఓ ఇంటిని సైతం కొనుగోలు చేశారని తాజాగా బాలీవుడ్‌ మీడియా కోడైకూస్తోంది. మూడు పడక గదులు ఉన్న ఈ ఇంటి కోసం ఆమె రూ.15 కోట్లు చెల్లించిందని సమాచారం..!!

amigos!

happy birthday meera jasmine!