in

this is why sai dharam tej changed his name!

సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయితేజ్ గా మార్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన నటించిన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ డిసెంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. తన పేరును సాయితేజ్ గా మార్చుకోవడానికి గల కారణాన్ని వివరించాడు. సాయిధరమ్ తేజ్ అని పిలవడం కొంచెం కష్టంగా ఉంటుంది అని,

అందుకే సాయితేజ్ అని సింపుల్ గా ఉండేలా మార్చుకున్నానని తెలిపాడు. అంతేతప్ప, తన పేరు మార్పుకు న్యూమరాలజీ కారణం కాదని స్పష్టం చేశాడు. కావాలంటే సాయి ధరమ్ తేజ్ అని కూడా పిలుచుకోవచ్చని తెలిపాడు. అయినా, పోస్టర్ లో అంతపెద్ద పేరు రాస్తే సిరా వృథా అవుతుందని, సాయితేజ్ అని రాస్తే సిరా ఆదా అవుతుంది కదా? అని చమత్కరించారు. స్కూల్లోనూ తనను సాయి అని కొందరు, సాయితేజ్ అని కొందరు పిలిచేవారని వెల్లడించాడు.

sai pallavi signs 5 telugu projects!

Jagapathi Babu’s Next Titled As ‘FCUK’!