in

Jagapathi Babu’s Next Titled As ‘FCUK’!

జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘కార్తీక్, అమ్ము అభిరామి‘ యువ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ ప్రొడక్షన్స్ నంబర్ 14 చిత్రం ‘ ఫాదర్- చిట్టి – ఉమ –  కార్తీక్’ ప్రముఖ కథానాయకుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా యువ జంటగా కార్తీక్, తమిళ నాయిక అమ్ము అభిరామి (తమిళ చిత్రం ‘అసురన్‘ ఫేమ్) నటిస్తున్నారు. బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

విద్యాసాగర్ రాజు చెప్పిన కథలోని నవ్యత ఎంతగానో నచ్చింది.  తమ సంస్థ నిర్మిస్తున్న పథ్నాలుగవ చిత్రమిది అని తెలిపారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. ఇక ఈ చిత్రం పేరు ‘ ఫాదర్- చిట్టి – ఉమ –  కార్తీక్’. చిత్ర కథానుసారమే పేరును నిర్ణయించాం. చిత్రం లోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నాము అని తెలిపారు నిర్మాత కె.ఎల్.

this is why sai dharam tej changed his name!

solo brathuke so better!