in

This is How Yash reacted to toxic film’s box office failure!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ చిత్ర ఫలితంపై ఆయన స్పందన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. యశ్ సన్నిహితుడైన జైదేవ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, సినిమా విడుదల అనంతరం తాను యశ్‌తో రెండుసార్లు మాట్లాడానని వెల్లడించారు. ఆ సంభాషణలో యశ్ ఏమన్నారో జైదేవ్ వివరించారు. జైదేవ్‌తో యశ్ మాట్లాడుతూ, “సినిమా ఫలితం గురించి ఆందోళన చెందవద్దు. దాన్ని ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేద్దాం..

రాబోయే రోజుల్లో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి” అని పేర్కొన్నట్లు జైదేవ్ తెలిపారు. యశ్ ధైర్యంగా ఈ మాటలు చెప్పినప్పటికీ, ఆయన గొంతులో మాత్రం స్వల్ప నిరాశ కనిపించిందని జైదేవ్ అభిప్రాయపడ్డారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల తీర్పే అంతిమమని జైదేవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం యశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యాయి. తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న యశ్ నిర్ణయాన్ని అభిమానులు హర్షిస్తున్నారు..!!

happy birthday SHRIYA!

EPIC: First Semester