in

The Competition Between Sreeleela And Krithi Shetty!

కృతి శెట్టి గుర్తుంది కదా.? అదేంటీ, ‘కస్టడీ’ తదితర సినిమాలు ఇంకా చేస్తోంది కదా ఈ ‘బేబమ్మ’.! అంత తొందరగా ఎలా మర్చిపోతాం.? టైమ్ బ్యాడ్.. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌లో కృతి శెట్టిని జనం మర్చిపోయే పరిస్థితి అయితే వచ్చేసింది. ముందు ముందు శ్రీలీల పరిస్థితి కూడా అలాగే అవబోతోందా.? అంతేనేమో.. అంటున్నారు సినీ పరిశ్రమలో కొందరు. ఏ ఛాన్స్ వచ్చినా, ముందూ వెనుకా ఆలోచించకుండా ఓకే చెప్పేస్తోందట శ్రీలీల. దాంతో, డేట్స్ క్లాష్ అయిపోతున్నాయ్. మహేస్ సినిమా చేస్తోంది.. ఇంకో సినిమా చేస్తోంది.. దాదాపు డజను సినిమాలున్నాయ్ శ్రీలీల చేతిలో. చాలావరకు పెద్ద సినిమాలే. అందునా, ఆయా హీరోల సినిమాలు శరవేగంగా తెరకెక్కే అవకాశాలు తక్కువ. దాంతో, డేట్స్ క్లాష్ అవుతున్నాయ్. ఇంకోపక్క, కొత్త సినిమాల్నీ ఓకే చేసేస్తోంది. కృతి శెట్టి కూడా ఇదే తప్పు చేసింది. శ్రీలీల కూడా అదేబాటలో నడుస్తోంది. అంటే, శ్రీలీల కూడా త్వరగా ఫేడవుట్ అయిపోతుందనేనా అర్థం.?

Sania Mirza comments on Samantha’s new add!

happy birthday vijay devarakonda!