
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సి[/qodef_dropcaps] నీ నటి తాప్సికి ఓ ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురైందట. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి ఆకతాయి చేష్టలు సర్వ సాధారణమే. కానీ తాప్సికి మాత్రం పవిత్రమైన పుణ్యస్థలంలో వేధింపులు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘గురునానక్ జయంతి’ రోజున నేను ఫ్యామిలీతో కలిసి కచ్చితంగా గురుద్వారకు వెళ్తాను. గతేడాది కూడా వెళ్లాను. అక్కడ భక్తులకు భోజనాలు వడ్డిస్తుంటాం. ఆ సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం వస్తాను. దాంతో ఒకర్నొకరు ఢీకొట్టుకుంటూ ఉంటారు. ఓసారి నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఆకతాయి నా నడుం పట్టుకోవాలని చూశాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఎలా బుద్ధిచెప్పాలో ముందే ఆలోచించి పెట్టుకున్నాను. అతని వేలు పట్టుకుని విరిచేశాను. దాంతో వాడు విలవిలలాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. నేను కూడా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాను’ అని తెలిపారు.