in

pawan to play pandugala saayanna’s role in his next?

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]జ[/qodef_dropcaps] నసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఇటీవలే పింక్ సినిమా రీమేక్ కు షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్ ఇంకో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పింక్ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తో కలిసి పీరియాడిక్ డ్రామా నేపథ్యం ఉన్న సినిమాలో పవన్ నటించబోతున్నారు. బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మీడియా లో వచ్చిన కథనాలు ప్రకారం పవన్ ఈ పీరియాడిక్ డ్రామాలో ఒక ఉద్యమ వీరుడు పాత్రా చేస్తున్నట్లుగా సమాచారం, 1870 దశకంలో నిజామ్ ఇంకా జమిందారులకు వ్యతిరేకంగా పోరాడిన పండుగల సాయన్న గారి రోల్ చేస్తున్నారు పవన్. మహబూబ్నగర్ కు చెందిన సాయన్న గారి జీవితం మీద ఆల్రెడీ డైరెక్టర్ క్రిష్ కొంత రీసెర్చ్ చేసి ఆయన గురించి సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం పవన్ ప్రత్యేకంగా ‘కర్ర సాము’ కూడా నేర్చుకోబోతున్నారట.. పవన్ ఫ్యాన్స్ ఇంకా సగటు తెలుగు సినిమా అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అయినప్పటికీ మీడియాలో వచ్చిన ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది తెలియాలి అంటే మరికొంత కలం వేచి ఉండక తప్పదు.

thapsee reveals a shocking secret!

another heroine roped in for rrr!