ఎస్.పి. వెంకన్న బాబు పేరు తెలియని వారు ఉండరు తెలుగు సినీ పరిశ్రమలో, ప్రొడక్షన్ మేనేజర్ గ, ప్రొడ్యూసర్ గ, అందరికి తలలో నాలుక ల ఉండే వెంకన్న బాబు గారికి 1982 లో హీరో కృష్ణ గారు ఒక ఇల్లు గిఫ్ట్ గ ఇచ్చారు. ప్రొడక్షన్ మేనేజర్ గ ఉంటూనే కృష్ణ, శ్రీదేవి, వంటి అగ్ర తారల డేట్స్ కూడా చూసే వారు వెంకన్న బాబు, 1982 ఆయన నిర్మాతగా కృష్ణ, శ్రీదేవి తో పి.సి. రెడ్డి డైరెక్షన్ లో “బంగారు భూమి” అని విజయవంతమయిన చిత్రం నిర్మించారు. ఆ చిత్ర విజయోత్సవ వేడుకలు విజయవాడ లో చేయాలనీ నిర్ణయించారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నపుడు హీరో కృష్ణ గారు,
పి.సి. రెడ్డి గారిని పిలిచి ఈ ఫంక్షన్ కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారట, సుమారు రెండు లక్షలు అవుతుంది అని చెప్పగానే , అంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఇంటికి ఇంకొక షీల్డ్ వస్తుంది, దానికి బదులు ఆ రెండు లక్షలతో వెంకన్న బాబు కి మద్రాసు లో ఒక ఇల్లు కొనిపెడదాము, ఇంత వరకు వెంకన్న బాబు కి సొంత ఇల్లు లేదు అన్నారట కృష్ణ గారు. కృష్ణ గారి గొప్ప మనసుకి ముగ్ధుడయిన పి.సి. రెడ్డి గారు అలాగే చేద్దాము అన్నారట. వెంటనే ఫంక్షన్ వద్దని చెప్పి దానికి అయ్యే డబ్బు తో వెంకన్న బాబు కి ఒక ఇల్లు కొని గిఫ్ట్ గ ఇచ్చారట హీరో కృష్ణ గారు.