in

thamanna to turn villain for vijay!

మిళ్ స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు విజయ్. ఆయన సినిమాలు తెలుగులోకూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే విజయ్  స్టార్ డైరెక్టర్ మురగదాస్ కలిసి తుపాకి  , కత్తి , సర్కార్ సినిమాలను చేసారు. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఈ సినిమా ‘తుపాకి’కి సీక్వెల్ అని అంటున్నారు. ఇప్పటికే మురగదాస్  విజయ్ కి ఈ స్టోరీ చెప్పారని..

దానికి విజయ్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. విజయ్ – మురుగుదాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబందించిన క్రేజీ న్యూస్ ఒకటి కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సినిమా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుందట. అయితే తమన్నా చేసేది హీరోయిన్ పాత్రకాదట. నెగిటివ్ రోల్ కోసం తమన్నాను ఎంపిక చేశారట దర్శకుడు మురగదాస్ . ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధానత్య ఉంటుందని.. తమన్నా పాకీస్థానీ స్పైగా కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి.

rana reveals his honeymoon spot!

Rakul Ready To Do Karanam Malliswari Biopic!