in

telugu girl Eesha Rebba’s special in Raviteja’s Dhamaka?

వితేజ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో ‘ధమాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ఐటమ్‌ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. దాన్ని మొదట అనసూయతో చేయించాలనుకున్నారు. కానీ ఆమె ఆల్రెడీ ‘ఖిలాడి’లో ఓ కీలక పాత్ర చేసింది. దాంతో ఈ కాంబో పెద్ద కిక్కివ్వదని మేకర్స్‌ అనుకున్నారట..ఆ తర్వాత పాయల్‌ రాజ్‌పుత్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె కూడా ఇప్పటికే ‘డిస్కో రాజా’ మూవీలో మాస్‌ మహారాజాతో జోడీ కట్టింది.

వారి పెయిర్‌‌కి పెద్దగా పేరు రాలేదు. కాబట్టి మరోసారి రిపీట్ చేయడం అనవసరం అనిపించి ఆ ఆలోచనను కూడా మార్చుకున్నారట. చివరికి ఈషా రెబ్బా అయితే బాగుంటుందని, ఇప్పటి వరకు ఆమె ఐటమ్ సాంగ్‌ చేయలేదు కాబట్టి ఫ్రెష్‌ ఫీల్ వస్తుందని ఫీలవుతున్నారట. దాదాపు కన్‌ఫర్మ్ చేసినట్టే అంటున్నారు. అచ్చ తెలుగు అమ్మాయే అయినా అందాల విందు చేయడానికి ఎప్పుడూ సంకోచించదు ఈషా. సినిమాల్లో డీసెంట్‌ రోల్సే చేసినా వెబ్‌ సిరీసుల్లో హాట్ హాట్‌గా అదరగొడుతోంది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్‌‌ డోస్‌ అంతకంతకూ పెంచి నెటిజన్స్‌ని ఆకట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశం వస్తే తన బెస్ట్ ఇవ్వడానికి కచ్చితంగా ట్రై చేస్తుంది.

Ghani Teaser, Varun Tej, Saiee Manjrekar, Kiran Korrapati!

Anushka Shetty’s trusted diet secrets for weight loss!