తెలుగు ప్రేక్షకులు మిస్ అయిన అరుదయిన కాంబినేషన్, దర్శకుడు దాసరి మరియు నాగభూషణం గారి కాంబినేషన్, వీరిద్దరూ సమకాలికులు కానీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక్క చిత్రం కూడా రాలేదు. దాసరి గారు తాత మనవడు చిత్రానికి ముందు, డైరెక్టర్ భీం సింగ్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గ పని చేస్తున్న రోజుల్లో నాగభూషణం గారు నిర్మించిన ” ఒకే కుటుంబం” చిత్రంలో కొంత భాగాన్ని దాసరి గారే డైరెక్ట్ చేయటం జరిగింది. ఆ అపరిచయం తో తాత మనవడు కథను ముందుగా నాగభూషణం గారికి చెప్పటం, ఆయన చిత్రం చేద్దామని చెప్పటం జరిగి పోయింది. కానీ అది కార్య రూపం దాల్చా లేదు. అదే సమయం లో దాసరి గారు ఆ కథను ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారి కి చెప్పటం అయన ఒకే చేయటం జరిగిపోయాయి. కానీ రాఘవ గారు చాల తక్కువ బడ్జెట్ లో చేయాలి అని చెప్పటం తో నటి, నటుల ఎంపిక మొదలెట్టారు.
దాసరి ఆ చిత్రంలో ఒక పాత్రకు నాగాభషణం గారిని అనుకోని ఆయన వద్దకు వెళ్లి విషయం చెప్పి పారితోషికం కొంత తగ్గించుకోమని అడిగారట దాసరి, దానికి ఆయన ససేమిరా అనటం తో, ఆ పాత్రకు గుమ్మడి గారిని తీసుకొని చిత్రం పూర్తి చేసారు దాసరి. తాత మానవుడు సూపర్ హిట్ అయింది, దాసరి తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు, కానీ ఆ తరువాత తాను నిర్మించిన ఏ చిత్రం లోను నాగభూషణం గారిని తీసుకోలేదు దాసరి గారు. నాగాభషణం గారికి తగిన పాత్రలు లేకనో, లేక అయన మీద దాసరి కినుక వహించారో, తెలియదు కానీ ఒక గొప్ప అరుదయిన కాంబినేషన్ మాత్రం తెలుగు ప్రేక్షకులు మిస్ అయ్యారు అన్నది మాత్రం వాస్తవం. కూల్ విలనిజమ్ కి పెట్టింది పేరు నాగభూషణం గారు, అలాగే తన కలం పదునుతో ఎన్ను రాజకీయ వ్యంగ్య చిత్రాలు తీశారు దాసరి, అటువంటి చిత్రాలలో వీరిద్దరి కాంబినేషన్ కుదిరి ఉంటె అత్యంత అద్భుతమయిన సన్నివేశాలు ఆవిష్కరించబడి ఉండేవి. ఉప్చ్! మనకంత అదృష్టం లేదు ఏం చేద్దాం !!!