in

N.T.R. RESPECT TOWARDS SENIORS!

యెన్.టి.ఆర్. ని గంట సేపు మేక్ అప్ రూమ్ బయట నిలబెట్టిన అలనాటి సూపర్ స్టార్ నారాయణ రావు. యెన్.టి.ఆర్. గారి మొదటి చిత్రం అయిన “మన దేశం ” చిత్ర హీరో అయిన నారాయణ రావు గారిని కలవటానికి వెళ్లారు రామ రావు గారు, ఆ టైం లో మేక్ అప్ రూమ్ లో ఉన్న నారాయణ రావు గారికి కబురు పెట్టారు, వెయిట్ చేయమని చెప్పారు నారాయణ రావు. అలాగే మేక్ రూమ్ బయట దాదాపు గంట సేపు వేచి ఉన్నారట యెన్.టి.ఆర్.గంట తరువాత బయటకు వచ్చిన నారాయణ రావు గారు యెన్.టి.ఆర్. ని పరీక్షగా చూసి, అరే మీరా? మిమ్మల్ని ఇన్స్పెక్టర్ డ్రస్ లో చూసి, చూసి పోల్చుకోలేక పోయాను, ఏమిటి ఇలా వచ్చారు అంటూ తెల్లటి పంచ, లాల్చీలో మెరిసిపోతున్న ఏంటి.ఆర్.ని చూస్తూ షూటింగ్ లేనప్పుడు ఇలాగె డ్రెస్ చేసుకుంటారా? చాల అందంగా ఉన్నారు అంటూ ప్రశంసించారట.

కొన్ని ఏళ్ళు గడిచాయి ఒక రోజు వాహిని స్టూడియో లో మేక్ అప్ రూమ్ లో ఉన్న యెన్.టి.ఆర్. ని కలవటానికి నారాయణ రావు వచ్చారు, అప్పటికి యెన్.టి.ఆర్. నెంబర్ వన్ పోసిషన్ కి చేరుకున్నారు, నారాయణ రావు మేక్ అప్ రూమ్ లో ఉన్న యెన్.టి.ఆర్. కి కబురు పంపారు, వెంటనే లోపలి రమ్మని పిలుపు వచ్చింది, వెళ్లిన నారాయణ రావు ని చూడగానే లేచి నిలబడి నమస్కరించి, ఆహ్వానించారు యెన్.టి.ఆర్. యెన్.టి.ఆర్. కి సీనియర్స్ మీద ఉన్న గౌరవం అటువంటిది. యెన్.టి.ఆర్ తనపట్ల చూపిన మర్యాదకు నారాయణ రావు ఎంతో సంతోషించారు, తాను వచ్చిన పని వివరించి కాసేపు ముచ్చటించి వెళ్లిపోయారట నారాయణ రావు. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనే విధంగా చూడకుండా, సదా సీనియర్ల పట్ల ఎంతో గౌరవం తో మెలిగే వారు యెన్.టి.ఆర్..!!

happy birthday anushka!

‘Urvashi Rautela’, the new item girl in Tollywood!