హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లికూతుకు కాబోతోందనే ప్రచారం కోలీవుడ్ లో ఊపందుకుంది. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకుంటుందట. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయనాయకుడి కొడుకుతో మేఘా ఆకాష్ వివాహం ఉంటుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ మేరకు అక్కడ వరుసగా కథనాలు వస్తున్నాయి. ఆ రాజకీయ నాయకుడి కుటుంబం, మేఘా ఆకాష్ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట. దశాబ్దాలుగా ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు, రాకపోకలు సాగుతున్నాయట.
అలా తమ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు. అలా సదరు పొలిటీషియన్ కొడుకుతో, మేఘా ఆకాష్ కు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల నిశ్చయించినట్టు తెలుస్తోంది.కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కెరీర్ లో పెద్దగా రాణించలేదు మేఘా ఆకాష్. ఆమె చేసిన సినిమాల్లో ఫ్లాపులే ఎక్కువ. చివరికి రజనీకాంత్ లాంటి హీరో కూడా ఆమెకు హిట్టివ్వలేకపోయాడు. ఉన్నంతలో రాజరాజచోర సినిమా మాత్రమే ఆమె కెరీర్ లో హిట్. అందుకే ఇక కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి, వైవాహిక జీవితంలో సెట్ అవ్వాలంటే మేఘా ఆకాష్ భావిస్తోందట..!!