in

telugu Actress Anjali’s shocking price for an item song!

మ‌ధ్య అంజ‌లి తెలుగు సినిమాల్లో అస్స‌లు క‌నిపించ‌లేదు. అలాగ‌ని త‌మిళంలోనూ పెద్ద‌గా చేసింది లేదు. అంజ‌లిని అంతా మ‌ర్చిపోతున్నార‌నుకుంటున్న స‌మ‌యంలో ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకొచ్చింది. `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`లో అంజ‌లి ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. అంజ‌లి ఐటెమ్ పాటేమిటి? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎందుకంటే ఆమెది హోమ్లీ ఇమేజ్‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులో త‌ను ఎంత ప‌ద్ధ‌తిగా క‌నిపించిందో గుర్తుండే ఉంటుంది. అచ్చ తెలుగింటి అమ్మాయిగానే అంజ‌లిని చూస్తారు. అలాంటిది అంజ‌లి ఐటెమ్ గీత‌మంటే.. ఆమాత్రం ఆశ్చ‌ర్య‌పోవ‌డం కామ‌నే. ఈ గ్లామ‌ర్ పాట‌కు సంబంధించిన ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో స‌రికొత్త లుక్‌లో అంజ‌లి క‌నిపిస్తోంది. ఐటెమ్ గాళ్‌కు కావ‌ల్సిన అన్ని హంగులూ త‌న‌లో ఉన్నాయ‌ని అంజ‌లి తత‌న లుక్ తో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టైంది.

అయితే ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ సినిమాలో ఐటెమ్ పాట పెట్టాల‌న్న ఆలోచ‌న చివ‌ర్లో తీసుకొన్న‌ద‌ట‌. ముందు నుంచీ ఈ ఆలోచ‌న అస్స‌లు లేద‌ట‌. సినిమా అంతా చూసుకొన్నాక‌.. మాస్‌కి న‌చ్చే ఊపున్న పాట ఒక‌టి ఉంటే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌తో ఈ పాట‌ని చేర్చార్ట‌. ఇప్ప‌టికిప్పుడు ఐటెమ్ గాళ్ ని వెదికి ప‌ట్టుకోవ‌డం క‌ష్టం క‌నుక‌… అంజ‌లిని ఎంపిక చేశార్ట‌. ఈ పాట కోసం అంజ‌లికి ఇచ్చింది రూ.12 ల‌క్ష‌లు మాత్ర‌మే అని టాక్‌. 12 ల‌క్ష‌లకు అంజ‌లి లాంటి ఐటెమ్ గాళ్ దొరికేసిందంటే.. చ‌వ‌క బేర‌మే అనుకోవాలి. అంజ‌లికి ఎలాగూ అవ‌కాశాలు లేవు. మూడు రోజులు ప‌నిచేస్తే.. రూ.12 లక్ష‌లు వ‌చ్చి ప‌డ‌తాయి. ఈ పాట హిట్ట‌యితే.. ఇలాంటి ఆఫ‌ర్లు మ‌రిన్ని వ‌స్తాయి. అందుకే అంజ‌లి ఓకే చెప్పేసింద‌ని టాక్‌.

Samantha Officially lands in karan johar’s Camp!

Tollywood producers plans new agreement deal with pooja!