in

TARAK CHESINA SWAPNA DUTT PELLI!

శ్రీకృష్ణుడు శశిరేఖ, అభిమన్యుల కళ్యాణం జరిపించినట్లుగానే, జూనియర్ యెన్.టి.ఆర్. కూడా ప్రముఖ నిర్మాత అశ్వని దత్తు గారి కుమార్తె స్వప్న దత్తు, ప్రసాద్ వర్మల వివాహం జరిపించారట. సీనియర్ యెన్.టి.ఆర్, అశ్వని దత్తు గారిది ఎంతో గొప్ప అనుబంధం, జూనియర్ యెన్.టి.ఆర్ తో మూడు చిత్రాలు నిర్మించారు దత్తు గారు. సినిమాల సంగతి ప్రక్కన పెడితే నిజ జీవితం లో జూనియర్ యెన్.టి.ఆర్ దత్తు గారి కుటుంబం తో చాలా సన్నిహితంగా ఉంటారట. ప్రసాద్ వర్మను ప్రేమించిన స్వప్న గారు ఒక స్టేజి లో తన లవ్ స్టోరీ వర్క్ అవుట్ కాదు అని నిస్పృహ తో ఉన్న సమయం లో జూనియర్ యెన్.టి.ఆర్ ఆమెకు అభయం ఇచ్చి..

ధైర్యం చెప్పి “మై హూన ” అంటూ, ఇటువంటి విషయాలలో ఆలస్యం అమృతం విషం అని చెప్పి, వెంటనే రంగం లోకి దిగారట. ఏదో షూటింగ్ నుంచి కనీసం మేక్ అప్ కూడా తీయకుండా వచ్చిన యెన్.టి.ఆర్, అలాగే దత్తు గారి వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడి ఒప్పించారట. పెద్ద రామయ్య భక్తుడయిన దత్తు గారిని బుల్లి రామయ్య ఒప్పించటం తో స్వప్నదత్తు, ప్రసాద్ వర్మ ఒక ఇంటి వారు అయ్యారు.జూనియర్ యెన్.టి.ఆర్ లేక పోతే తమ వివాహం జరిగిఉండేది కాదని దానికి తాను ఎప్పుడు తారక్ కు కృతజ్ఞత గ ఉంటానని చెప్పారు స్వప్న దత్తు. తమ బ్యానర్ లో సినిమాలు చేసిన, చేయక పోయిన తారక్ నాతో ఎప్పుడు క్లోజ్ గానే ఉంటారని తెలియ చేసారు స్వప్న దత్తు..!!

Karthikeya 2!

Swara Bhasker compares Bollywood’s situation to Rahul Gandhi!