in

KHUSHBU A HUGE FAN OF TARAK!

సినిమా నటి, నటులకు అభిమానులు ఉంటారు, దీనినే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు, మిగతా రంగాల వారి కంటే సినీ రంగం లో ఉన్న వారికే ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. మరి నటి, నటులకు అభిమాన నటులు,నటీమణులు ఉండరా? అంటే, ఎందుకు ఉండరు, తప్పకుండ ఉంటారు. ఉదాహరణకు హీరో కృష్ణ గారు యెన్.టి.ఆర్. కి వీరాభిమాని, కృష్ణం రాజు గారు అక్కినేని అభిమాని,చిరంజీవి గారు ఎస్.వి.ఆర్. అభిమాని ఇలా మన అభిమాన నటులకు కూడా అభిమాన నటి, నటులు ఉంటారు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో నటి ఖుష్బూ గారు తన అభిమాన నటుడు ఎవరో చెప్పటం జరిగింది.

తాను జూనియర్ యెన్.టి.ఆర్. కి వీరాభిమానిని అని చెప్పటమే కాకా, ఆ ఇంటర్వ్యూ ద్వారా తనకు యెన్.టి.ఆర్. ఆటోగ్రాఫ్ కావాలని కోరారు. వీరిద్దరూ కలసి “యమదొంగ” చిత్రంలో నటించారు కానీ, వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ లేవు అందులో, కావున కలుసుకోవటం జరగలేదు.ఇంటర్వ్యూ చేసిన టి.వి. ఛానల్ వారు విషయం జూనియర్ యెన్.టి.ఆర్. కి తెలియ చేయగా ఆయన ఎంతో సంభ్రమానికి లోనయ్యారు. ఆవిడ కోరిన విధంగానే ఆటోగ్రాఫ్ ఇచ్చి, ఫ్యూచర్ లో కలసి నటించే అవకాశం వస్తే తప్పకుండ నటిస్తానని చెప్పారు.సీనియర్ నటులను ఎంతో గౌరవించే జూనియర్ యెన్.టి.ఆర్. ఖుష్బూ వంటి సీనియర్ నటి తనను అభిమానించటం ఎంతో థ్రిల్లింగ్ ఉంది అని, ఇది తనకు ఒక ఆశీర్వాదం వంటిది అని చెప్పారు..!!

south star Trisha likely to join Congress!

amit shah says jr ntr ‘gem of Telugu cinema’!