ప్రముఖ సినీ రచయిత ఆత్రేయ గారు, సినీ రంగ ప్రవవేశం చేయక ముందు మంచి నాటక రచయిత, సినీ రంగ ప్రవేశం చేసిన తరువాత ఆత్రేయ గారు నాటకానికి దూరం అయ్యారు, చాల మంది ఆత్రేయ గారిని గురువు గారు నాటకాలు వ్రాయడం మానేశారు, మళ్ళీ వ్రాయండి అని అడుగుతుండే వారు, కానీ ఆయనకు వెసులు బాటు లేక వ్రాస్తాను, వ్రాస్తాను అంటూ సంవత్సరాలు గడచిపోయాయి. అటువంటి రోజుల్లో మద్రాస్ ఆంధ్ర క్లబ్ లో ” గో గ్రహణం ” అనే నాటకం చూసారు ఆత్రేయ గారు, ఆ నాటకం ఆయనకు చాల నచ్చింది, ప్రైజ్ ఇవ్వడానికి స్టేజి మీదకు వెళ్లిన ఆత్రేయ గారు, ఇంత కాలం నేను నాటకాలు వ్రాస్తాను, వ్రాస్తాను అని అన్నాను కానీ నేను ఇక నాటకం వ్రాయను,
ఇదుగో తనికెళ్ళ భరణి అనే వాడు వచ్చాడు ఇక నాటక రంగానికి నా అవసరం లేదు, అని పొగడ్తలతో ముంచేశారట. ఇంతకీ ఆయనకు నచ్చిన ” గో గ్రహణం ” నాటక రచయిత తనికెళ్ళ భరణి గారే, భరణి గారిని స్టేజి మీదకు పిలిచి, 500 వందల రూపాయలు బహుమతిగా ఇచ్చారట, ఆ 500 వందలలో 400 వందలతో సెలెబ్రేట్ చేసుకొని మిగిలిని వంద రూపాయల నోటు మీద ఆత్రేయ గారి పేరు వ్రాసి దాచుకున్నారట తనికెళ్ళ భరణి,ఈ సంఘటన 1980 లో జరిగింది, అదే తనికెళ్ళ భరణి గారు కాల క్రమం లో సినీ రచయిత గ మారి, ఆ తరువాత క్యారెక్టర్ నటుడిగా సినీ రంగం లో కొనసాగుతున్నారు..