in

macho star Gopichand Teams Up With Maruthi for his next!

ప్రతి రోజు పండగే సినిమాతో భారీ హిట్ అందుకుని తన సత్తా చాటుకున్న దర్శకుడు మారుతి దాసరి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించాలని మారుతి అనుకున్నాడు. కానీ కరోనా రావడంతో అతడి సినిమా వెనక్కి వెళ్లింది. అయితే లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత మారుతి తన సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడు. అందుకోసం గోపీచంద్‌ను కలిసాడు మారుతి. కథ నచ్చడంతో గోపీ చంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనపించనున్నాడు. ఈ సినిమా జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. అయితే.. తాజాగా ఇవాళ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ త్వరలోనే రాబోతోందని మారుతి వెల్లడించారు. కాగా…ప్రస్తుతం గోపీచంద్ తన నూతన సినిమా సీటీమార్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా విడుదలైన తరువాత మారుతి సినిమాలో జాయిన్‌ కానున్నాడు.

Tanikella Bharani gariki rs 500 bahumathi ga icchina manasu kavi aathreya!

Radhe Shyam director makes a promise to Prabhas fans!