in

Jr NTR- Trivikram Film Launch Date Confirmed!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌తో వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ.. మూవీ ప్రకటన మాత్రం వచ్చింది. ఈ లాక్‌డౌన్‌లో ఇతర నటీనటులను కూడా త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేసినట్లుగా సమాచారం.

ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. పూజా కార్యక్రమాలకు కూడా ముహుర్తం ఫిక్స్‌ అయింది. జనవరి 14న అంటే మకర సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ ల మూవీకి కొబ్బరికాయ కొట్టబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాసిన అండ్‌ హారిక వారి ఆఫీస్‌లో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని అంటున్నారు.

ravi teja gets career best openings for ‘krack’!

Tanikella Bharani gariki rs 500 bahumathi ga icchina manasu kavi aathreya!