in

tamil star hero turns villain for mahesh babu ?

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌`తో బిజీగా ఉన్నారు. ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వేస‌వి కానుకగా ఏప్రిల్ 1న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ఆపై మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు మ‌హేశ్. అద‌య్యాక‌.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు. `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత జ‌క్క‌న్న డైరెక్ష‌న్ లో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ – ఇండియా వెంచ‌ర్ గా సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు విక్ర‌మ్ ని న‌టింప‌జేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. విక్ర‌మ్ బ్యాడీగా క‌నిపించ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో తెలుగు చిత్రం `ఊహా` (1996), త‌మిళ చిత్రం `ఇరుముగ‌న్` (తెలుగులో `ఇంకొక్క‌డు`)(2016)లో విక్ర‌మ్ నెగ‌టివ్ రోల్స్ లో క‌నిపించి అల‌రించారు. మ‌రి.. మ‌హేశ్ – జ‌క్క‌న్న కాంబినేష‌న్ మూవీలో విక్ర‌మ్ న‌టిస్తున్నారో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

okeroju thommidhi cinemalu modhalu pettina Taraka Ratna!

sanjana galrani latest sizzling hot photoshoot!