in

tamil heroes shows interest on kriti shetty!

కప్పుడు స్టార్ హీరోయిన్లుకు పోటీ ఇచ్చే స్థాయి నుంచి అవకాశాల కోసం వెయిట్ చేసే స్థాయి వరకు పడిపోయింది కృతి పరిస్థితి. ఇప్పుడు తెలుగులో ఈమె చేతిలో ఉన్న ఏకైక మూవీ శర్వానంద్ సినిమా ఒకటే. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ తమిళ తంబీలను నమ్ముకుంటుంది. టాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం అక్కడ కృతి మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే కార్తీతో వాతియారే, జయం రవితో జెనీ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కృతి రీసెంట్‌గా లవ్ టూడే హీరో ప్రదీప్ రంగనాథ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. ఒక వేళ ఈ మూడు సినిమా హిట్ అయితే..కృతి శెట్టి మొత్తం తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంటుంది..!!

Tripti Dimri opens up On Her Equation With Rashmika Mandanna!

viral: Samantha responds about her Second Marriage