in

sweety anushka to join hands with megastar!

స్వీటీ అనుష్కకు ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క నటిస్తుందంటూ టాక్‌ నడుస్తోంది. కాగా ఖైదీ 150తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన చిరు యంగ్‌ హీరోలకు పోటీగా వరస సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇప్పటికే ఆయన కొరటాల శివ దర్శకత్వంతో రూపొందిన ఆచార్య సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆచార్య షూటింగ్‌ అనంతరం ఏమాత్రం గ్యాప్‌ లేకుండా ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీర్రాజు’ సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. ఇదిలా ఉండగా వీటితో​ పాటు చిరు మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్‌గా అనుష్క పేరు పరిశీలించారట. అంతేకాదు ఇప్పటికే ఆమెను సంప్రదించి కథ వివరించినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి అనుష్క తన సమాధానం ఇవ్వాల్సింది ఉందని వినికిడి. ఆ తర్వాత దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై స్వీటీ స్పందించేవరకు వేచి చూడాలి.

f cube ‘ramesh babu’!

poonam pandey visits hyderabad for ‘nasha’ promotions!