in

Sushanth as Ram in Ravi Teja’s ‘Ravanasura’!

కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సుశాంత్ “చి.ల.సౌ” సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో పర్వాలేదనిపించినా సుశాంత్ తాజాగా ఇప్పుడు “రావణాసుర” అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్వామిరారా, దోచెయ్, కేశవ వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఇంతకుముందు ఎప్పుడూ కనిపించనటువంటి స్టైలిష్ లుక్ తో సుశాంత్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ రామ్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు అని పోస్టర్ ద్వారా తెలియజేశారు దర్శకనిర్మాతలు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగులను అందించారు. “హీరోస్ డోంట్ ఎగ్జిట్” అనే ఒక క్యాప్షన్ తో ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Allu Aravind to come up with mega plans for ‘Aha’ soon!

bangarraju!